calender_icon.png 8 October, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేలికపాటి వర్షానికే జలమయమైన చౌటుప్పల్ మున్సిపాలిటీ

07-10-2025 10:12:29 PM

చౌటుప్పల్ (విజయక్రాంతి): హైదరాబాద్ కి కూతవేటు దూరంలో హెచ్ఎండిఏ పరిధిలో మునుగోడు నియోజకవర్గానికీ తలమానికంగా విజయవాడ రహదారికి అనుకోని ఉన్నా అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. చౌటుప్పల్ మున్సిపాలిటి చిన్నవర్షానికే సర్వీస్ రోడ్లు అన్ని జలమయం అయ్యి వాహన చోదకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి ఐతే దయనీయం వానకి ఎండకి అరచేతినీ అడ్డం పెట్టి కూటి కోసం వాళ్ళు పడే ఇబ్బందులు శోచనీయం, పదవుల కోసం ఆరాట పడే నాయకులు ఈ సమస్యల మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం, మొదటగా బ్లాక్ స్పాట్గా గుర్తించి మొదట మొదలు అయిన పై వంతెన పనులు చౌటుప్పల్ మున్సిపాలిటి పరిధిలో మధ్యలో వదిలేసి వెళ్ళడానికి ఎవరు కారణం రాజకీయ నాయకులదా లేక ప్రభుత్వ అధికారులదా, అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఎవరి అసమర్ధత వల్ల ఆగింది ఇలా చెప్పు కుంటు పోతే మున్సిపాలిటీ మొత్తం సమస్యల నిలయంగా మారింది, పదవుల మీదే కాదు సమస్యల మీద దృష్టి సారించి కనీసం మా బ్రతుకు మమ్మల్ని బ్రతిక నివ్వండి అని చిరు వ్యాపారులు దీనంగా వేడుకున్నారు.