07-10-2025 10:40:52 PM
నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టేసి చితకబాది..!
తల్లి ప్రోత్సహంతోనే దాడి జరిగిందంటున్న గ్రామస్తులు..?
కనబడటం లేదని తండా వాసులు పోలీస్ లకు ఫిర్యాదు..
పెన్ పహాడ్: నేను పడుతున్న ఇబ్బందులు నా కొడుకులకు బాధలు రావద్దని ఉన్నత చదువులు చదివించడానికి నానా ఇబ్బందులు పడుతూ.. ఆలనా.. పాలన చూసుకుంటున్న ఆ కన్నతండ్రిపైనే కొడుకులు క్రూరత్వంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మేగ్య తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. తండా వాసుల సమాచారం ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు కుర్వా తన భార్య కోటమ్మ సుమారు గత 6 సంవత్సరాల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ సూర్యాపేటలో వేరే నివాసం ఉంటుంది. వీరికి ఉన్న ఇద్దరు కొడుకులు పవన్, ప్రవీణ్ కుమార్ తన తండ్రి పోషణలో ఉంటూ చదువు కుంటున్నారు. అయితే సూర్యాపేటలో ఉంటున్న తన తల్లి కోటమ్మ దగ్గరికి తరచూ పోతుంటారు. అంతే కాదు ఈ ఇద్దరు కుమారులు తన తల్లి చెప్పుడు మాటలు విని తన తండ్రిపై పగ పెంచుకున్నారు.
తన భర్తను అంతమొందించడానికి, దాడికి ఉసి గోలిపే విధంగా కొడుకులను పురామహించడం పరిపాటిగా ఉండేదని తండా వాసులు పేర్కొంటున్నారు. కాగా సోమవారం అర్ధరాత్రి సమయంలో తండ్రి ఆంగోతు కుర్వా నిద్రిస్తుండగా కొడుకులు ఇద్దరు తన తండ్రికి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్ళు కట్టేసి ఇనుప పైపు, కర్రతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో రెండు కాళ్ళు, రెండు చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. అప్పటికే సృహ తప్పిన తన తండ్రిని ఆటోలో ఆసుపత్రికి తరలిచారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయం కుర్వా జాడ లేకపోవడం.. ఆటో వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు తండావాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, తండావాసులు కలసి ఆసుపత్రికి చేరుకొని దాడీ గల వివరాలు సేకరించడంతో కన్న కొడుకులే ఈ ఘాతుకానికి పాల్పడగా తల్లి చంపేసి కాలువలో పడేయాలని ఆదేశించి ఉసిగొల్పినట్లు ఈ విషయంపై బాధితుడే పోలీసుల ఎదుట మొర పెట్టుకున్నాడని తండా వాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ గోపికృష్ణను వివరణ కోరగా మాకు ఏలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.