05-07-2025 01:42:17 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్ ఆత్మకూరి రామారావు పాఠశాల 17వ వార్షికోత్సవం, లీడర్‌షిప్ ప్రమా ణ స్వీకార కార్యక్రమాన్ని శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు ఎండీ కె అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ గోపాలకృష్ణన్ (ఐఏఎస్ రిటైర్డ్), పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, సి రామదే వి డైరెక్టర్, వి శ్రీరామ్ జాయింట్ డైరెక్టర్, మదన్‌రావు రీజినల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (దక్షిణ జోన్ ఏఐఐ), జి అరుణశ్రీ భవన్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ ప్రిన్సిపాల్, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ప్రిన్సిపాల్ శ్రీలత నాయర్ అతిథులను ఆహ్వానించి, సీబీఎస్‌ఈ పరీక్షల్లో పాఠశాల 100 శాతం ఫలితాలు సాధించిందని గర్వం గా ప్రకటించారు. అనంతరం ఎస్ గోపాలకృష్ణన్, భవన్ వ్యవస్థాపకుడు మున్షిజీ సేవలను స్మరించుకుని, భవన్ సంస్థలు అందించే విద్యపై ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా బోర్డు పరీక్షలలో మెరిసిన 10, 12వ తరగతి విద్యార్థులకు, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆపై ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమంలో కె అశోక్‌రెడ్డి నూత నంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జిలను అటాచ్ చేసి ప్రమాణ స్వీకారం చేయిం చారు. వనమహోత్సవ వారోత్సవాల్లో భాగంగా అతిథులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. టెన్నిస్ కోర్టు, ఈకో-ఫిట్ జోన్‌ను ప్రారంభించారు. పాఠశాల వార్షిక మేగజైన్ ‘సంస్కృతి ను విడుదల చేశారు.