calender_icon.png 15 July, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ హక్కుల కోసం పోరాడే వారిపై దాడి దారుణం

15-07-2025 12:00:00 AM

కల్వకుర్తి, జూలై 14: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేసిన దాడిని కల్వకుర్తి బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సోమవారం కమి టీ తాలూకా అధ్యక్షుడు మేకల రాజేందర్ మాట్లాడుతూ ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సామాన్యుల మధ్యన మాట్లాడే సా మెతల కోణంలో ఉన్నప్పటికీ, దాన్ని వికృతంగా అర్ధం చేసుకుని జాగృతి అధ్యక్షురాలు కార్యకర్తలతో దాడి చేయించడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వ్యవహారం లా ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని స్వాగతించిన బీసీ సంఘాలు& దీనికి జాగృతి ఉద్యమమే మూలమన్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇది అనేక బీసీ సంఘాల పోరాట ఫలితం, ఒక్కరిని కేంద్రీకరించడం తగదన్నారు.ఈ ఘటనను ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి, జాగృతి కార్యకర్తలతోపాటు ఎమ్మెల్సీ కవితపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది.

మీడియా స్వేచ్ఛను హరించే విధంగా జరుగుతున్న దాడులను కూడా నేతలు ఖండించారు.ఈ సమావేశంలో బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా ప్రధాన కార్యదర్శి పి. గోపాల్, నేతలు సదానందం గౌడ్, రమేష్ బాబు, శ్రీను రజక, సైదులు యాదవ్, శంకరాచారి, రా జు, మల్లేష్ తదితరులుపాల్గొన్నారు.