15-07-2025 12:00:00 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై14 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల నియంత్రణలో విద్యార్థులు ముఖ్యపాత్ర పోషించాలని ఎస్పి కాంతిలాల్ పాటిల్ అన్నారు.సోమవారం కెరామేరీ మండలం మోడీ ఆశ్రమ పాఠశాల లో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగం గా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. విద్యార్థులు యువత మాదకద్ర వ్యాల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉంటూ తమ లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
మాదకద్రవ్యాల విక్రయం సరఫరా చేస్తున్న ట్లు తెలిస్తే 1908, 8712670551కి కాల్ చేసి తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఈఓ ప్రకాష్, సిఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, హెచ్‌ఎం ప్రేమ్ దాస్, పటే ల్ ఆశ్రం లక్ష్మణ్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.