08-10-2025 12:00:00 AM
ఎంపీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
నిర్మల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందివ్వాల ని టీజీ. ఎన్.పి.డి.సి.ఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ని సమావేశ మందిరంలో టీజీ. ఎన్.పి.డి.సి. ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులతో, ఆ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో విద్యుత్ వినియోగంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా లో కొత్త విద్యుత్ ఉపకేంద్రాలు, విద్యుత్ లైన్లు అవసరముంటే వెంటనే తమకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అటవీ ప్రాంతా ల్లో నూతన విద్యుత్ కేంద్రాల నిర్మాణం, విద్యుత్ స్థంబాల స్థాపన, తదితర నిర్మాణా ల విషయంలో అటవీ అనుమతులు వీలైనంత త్వరగా పొందాలన్నారు. అటవీ అధికారులతో సమన్వయ పరుచుకోవాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి వ్యయ అంచనాలు సిద్ధం చేసి నివేదికలు పంపాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
అవసరమైన చోట్ల మర మ్మత్తులు చేపట్టాలన్నారు. రాబోయే వేసవి ని దృష్టిలో ఉంచుకొని, రైతాంగానికి, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేలా ఇప్పటి నుంచే ప్రాణాలకలు సిద్ధం చేసుకోవాలన్నా రు. పంట కోతలు పూర్తవ్వగానే అవసరమైన చోట పంట పొలాల్లో నూతన విద్యుత్ లైన్లు, మరమత్తులు చేపట్టాలన్నారు. ప్రజలకు, రైతాంగానికి అనవసర కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. విద్యుత్ మరమ్మత్తులు, విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించాలని తెలిపారు. సమావేశంలో విద్యు త్ శాఖ అధికారులు పాల్గొన్నారు.