13-12-2024 01:31:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): సినీ నటుడు మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో తొలుత బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకుని 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను.. మోహన్‌బాబుకు చెందిన బౌన్స ర్లు, సహాయకులు బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. దీనికితోడు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కొని అతడి తలపై కొట్టగా అతడికి తీవ్ర గాయమైంది. మోహన్‌బాబు చేతిలో గాయపడిన రిపోర్టర్ రంజిత్ ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..
గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్ప త్రి నుంచి మోహన్‌బాబు డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్ష ణ అనంతరం ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆస్పత్రి లో చేరిన విషయం తెలిసిందే. రెండు రోజుల చికిత్స అనంతరం గురువారం మధ్యాహ్నం మోహన్‌బాబు డిశ్చార్జ్ అయ్యారు.
అయితే తన నివా సం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు నోటీసులు జారీచేయగా.. దీనిపై మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈనెల 24 వరకు మోహన్‌బాబును విచారణకు పిలవవద్దని స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
కుటుంబ సమస్యల్లో మీడియా జోక్యం ఎందుకు?
నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని మీడియా ప్రతినిధులు లోపలికి రావడం న్యాయమా? మీరే ఆలోచించండి ప్రజలారా. నేను కొట్టింది తప్పే, కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి. తాను జర్నలిస్ట్‌ను కొట్టాలని దైవ సాక్షిగా అనుకోలేదని సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు. మంగళవారం రాత్రి తన ఇంట్లోకి దూసుకొచ్చింది జర్నలిస్టులా? కాదా? అన్న విషయం తనకు తెలియదన్నారు.
జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు. ‘కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలి. దాదాపు 95 శాతం కుటుంబాల్లో ఏదో ఒక వివాదం ఉండే ఉంటుంది. నాలుగు రోజులు నా ఇంటి ముందు మీడియా ప్రతినిధులు వ్యాన్లు పెట్టుకొని రాత్రి, పగలు వేచి చూడటం బాధించింది. మీడియా వారిపై దాడిచేయాలని దైవసాక్షిగా అనుకోలేదు. రాత్రి 8గంటల సమయం లో నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు మీడియా వాళ్లా? ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు.
మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడిచేసే అవకాశం ఉందని ఆలోచించా. చీకట్లో ఘర్షణ జరిగింది. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు నేను బాధపడుతున్నాను. ఆ మీడియా ప్రతినిధి నాకు తమ్ముడి లాంటివాడు. అతని భార్యాబిడ్డల గురించి ఆలోచించారే తప్ప నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు. నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు. సాహసం ఒక్కటే నాకున్న ధైర్యం. నీతిగా, ధర్మంగా బతకాలన్నదే నా ఆలోచన. కట్టుబట్టలతో చెన్నై వెళ్లి అనేక అవమానాలు పడి, ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చాను.
విద్యాసంస్థలు నెలకొల్పి 25 శాతం ఉచిత విద్యను అంది స్తున్నాను. మా పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ కొలువులు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవ ర్తించి కొట్టి ఉంటే నాపై 50 కేసులు కాదు 100 కేసులు పెట్టుకోవచ్చు. నన్ను అరెస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అరెస్ట్ అయ్యేవాణ్ణి. నా ఇం ట్లోకి వచ్చి నా ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు.
మేం కూర్చొని మాట్లాడుకుం టాం. ఏదో ఒక రోజు మా సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబసభ్యల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవన్నీ మరిచిపోయి నేను కొట్టిన విషయం ప్రస్తావిస్తున్నారు. మీకు టీవీలు ఉండొచ్చు, నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడి యా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొటింది వాస్తవమే, అసత్యం కాదు’ అని మోహన్‌బాబు అన్నారు.