calender_icon.png 5 October, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాత లడ్డు రూ.67,201

04-10-2025 07:07:52 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం దుర్గామాత లడ్డుకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన స్కామర్స్ టీం సభ్యులు రూ. 67,201 పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లడ్డు వేలం పాటలో దక్కించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మాకు దుర్గామాత లడ్డును వేలంపాటలో తీసుకుంటున్నందుకు అంతా బాగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.