calender_icon.png 5 October, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు వ్యవసాయ బోర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలి

04-10-2025 07:04:49 PM

విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్

కామారెడ్డి,(విజయక్రాంతి): రైతులు వ్యవసాయ బోర్లకు కెపాసిటర్లను అమర్చాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం కామారెడ్డి మండలంలోని టేక్రియాల్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్  శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు.

రైతులు వ్యవసాయ బోర్లకు కెపాసిటర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలని, ఎలాంటి విద్యుత్ మరమ్మత్తులకైనా సొంతంగా ప్రయత్నించకుండా విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు కాల్ చేసి విద్యుత్ సంబంధిత సేవలు పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో టేక్రియాల్ మాజీ కౌన్సిలర్  శంకర్ రావు, 30 మంది రైతులు పాల్గొన్నారు.