calender_icon.png 5 October, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలుగు పొలుసులు స్మగ్లింగ్ ముఠా అరెస్టు

05-10-2025 11:26:54 AM

హనుమకొండ: అలుగు(పాంగోలిన్) పొలుసులు రవాణా చేస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల్లో నలుగురు ఉన్నారని, వారి నుంచి 6.53 కిలోల అలుగు పొలుసులు స్వాధీనం చేసుకోని హనుమకొండ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చైనాతోపాటు దక్షిణాసియాలో అలుగు పొలుసులకు భారీ డిమాండ్ ఉందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. విక్రయించేందుకు ఏజెంట్ల వద్దకు తీసుకెళ్తుండగా నిందితులు డీఆర్ఐ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు.