calender_icon.png 5 October, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌పై పీకే రంకెలు బీఆర్‌ఎస్‌కు అండదండలు?

05-10-2025 01:11:16 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): దేశ రాజకీయ యవనికపై రణనినాదా లు ఎటువైపునుంచి ఎటు వస్తాయో ఊహించలేం. బీహార్‌లోని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఇప్పుడు తొడకొట్టిమరీ సవాలు విసురుతున్నారు. ఎవరిపై నో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆయన అనూహ్యస్థాయిలో కారా లుమిరియాలు నూరుతున్నారు. బీహార్‌లో కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాను న్నాయి.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో రాష్ట్రమంతా కలియతిరుగుతున్నారు. మరోపక్క  ప్రశాంత్ కిషోర్ వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంట ర్వ్యూల సారాంశం ఒక్కటే. బీహారీలను తూలనాడిన రేవంత్‌రెడ్డిని రాజకీయంగా అంతమొందిస్తానని. శపథం చేస్తున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ‘౨౦౨౮లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వాన్ని కూలదో యడం ఖాయం. ఈ పనిలో నన్ను ఏ శక్తీ ఆపలేదు’. అని ప్రశాంత్ కిషోర్ గతనెల ౩౦న ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గర్జించారు.

ఇది అల్లాటప్పా విష యమేమి కాదు, ఇలా భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఘన చరిత్రే ఉంది. ౨౦౧౨లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీకి విజ యం చేకూర్చడంలోనూ, ౨౦౧౫లో బీహా ర్ అసెంబ్లీకి నితీశ్‌కుమార్ రాచబాటలో పయనించడంలోనూ ఆయన వ్యూహాలు ఉన్నాయి. అయితే.. ౨౦౨౩ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గెలుపు ఖాయమని ఆయన చెప్పిన జోస్యం ఫలించలేదు.

ఇలా ఆయన తప్పటడుగులు వేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక రేవంత్‌రెడ్డితో ప్రశాంత్ కిషోర్ వైరం ఇప్పటిది కాదు. ౨౦౨౩ డిసెంబర్‌లో దాని మూ లాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ దశాబ్ద కాలపు అధికార చరిత్రను కాలరాసి, ౬౪ సీట్ల తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి ౨౦౨౩ డిసెంబర్ ౭న విజయశంఖం పూరిస్తూ ఉపన్యసించారు. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన ఆనందోత్సహాల్లో ఆయన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై పలు విమర్శలు గుప్పించారు. నర్మగర్భ వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.

బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన కార్మికుల పట్ల కేసీఆర్‌కు వల్లమాలిన ప్రేమ ఉందని వ్యాఖ్యానించారు. ‘లేబర్లుగా పనిచేయడం బీహారీలకు, యూపీవాసులకు మామూలే. లేబర్ పని వారి డీఎన్‌ఏలోనే ఉంది. లేబర్లుగా పనిచేసేందుకే వారు పు ట్టారు’ అని రేవంత్‌రెడ్డి ఆనాడు ఆవేశంగా అన్న మాటలకు సభలో ఉన్నవారంతా అప్పుడు చప్పట్లు కొట్టారు. వివిధ నిర్మాణ ప్రాజెక్టులకు కేసీఆర్ బయటి రాష్ట్రాలవారిపై ఆధారపడటాన్ని రేవంత్‌రెడ్డి మరోలా ప్రస్తావించారని అంతా అనుకున్నారు. కాని, జాతీ య స్థాయిలో అది వివాదం అయ్యింది.

ఉత్తరేొందక్షిణం అంటూ దేశంలో విభజన తెచ్చేందుకు కాంగ్రెస్ ఇలా కుట్ర చేస్తున్నదని బీజేపీ విరుచుకుపడింది. బీహార్ ప్రజలను రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని అందుకు ఆయన క్షమాపణ చెప్పితీరాలని  కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ డిమాండ్ చేశా రు. ౨౦౨౩ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లోని అవ్యస్థీకృత కార్మిక రంగంలో బీహార్ వలస కార్మికులు ౧౫ శాతం వరకు ఉన్నారు. తక్కువ వేతనాలకు పనిచేసే ఈ వలస కార్మికులు రాష్ట్ర అర్థిక వ్యవస్థకు జీవనాడిగా మా రారు. బీహారీలపై తను చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ విధానాలను తప్పుబట్టేవే కానీ బీహా రీలను కించపరిచేందుకు కాదు అని రేవం త్‌రెడ్డి ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాలచక్రం తిరిగింది. ౨౦౨౫ ఆగస్టులో.. బీహార్‌లో రాహుల్‌గాంధీ ‘ఓటర్ అధికార్ యా త్ర’లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. దీంతో ‘డీఎన్‌ఏ’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆగస్టు ౨౬ మోతీహరిలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. ‘బీహారీల డీఎన్‌ఏలోనే లేబర్ వర్క్ ఉందన్న రేవంత్‌రెడ్డిని బీహార్‌లో వేదికలెక్కిస్తున్నారు. అలాంటి వ్యక్తిని తెలంగాణకు తిప్పిపంపడం బీహార్‌లోని ప్రతిఒక్కరి బాధ్యత’ అన్నారు.  ‘బీహార్‌లోని ఏ గ్రామానికైనా రేవంత్‌రెడ్డి వెళ్తే ప్రజలు కట్టెలు పట్టుకొని వెంటపడతారు’ అని ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు.  

ఆనాడు కలువలేదా..!

బీహారీల ఆత్మగౌరవాన్ని, తన వ్యక్తిగత, వృత్తిపరమైన అన్ని కారణాలతో ప్రశాంత్ కిషోర్ రేవంత్‌రెడ్డిపై అస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గతనెల ౨౬న ఆయన ఒక క్లిప్ వదిలారు. అందులో ‘తెలంగాణ అసెం బ్లీ ఎన్నికలకు ముందు నా దగ్గరికి మూడుసార్లు వచ్చారు. రాజకీయ సలహాలు ఇవ్వా లని కోరారు. ‘భయ్యా, మీ ఆశీస్సులు ఉంటే మేం గెలుస్తాం’ అని చెప్పారు’.

అని ప్రశాంత్ కిషోర్ బయటపెట్టారు. ‘బీహారీలకు తక్కువ ఐక్యూ, డీఎన్‌ఏ ఉంటే ఎన్నికల్లో సహాయం చేయాల్సిందిగా నాలాంటి బీహారీల ముం దు ఆయన మోకరిల్లడం ఎందుకు?’ అని అన్నారు. ఈ మాటలే నిజమైతే రేవంత్‌రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ఆశీర్వాదం కోరారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రశాంత్ కిషోర్ ౨౦౨౪లో జన్ సూరజ్ పార్టీ స్థాపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ౨౪౩ స్థానాలకు పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది మొదట్లో సీ ఓటర్ నిర్వహించిన సర్వేల్లో జేడీ(యూ), ఆర్జేడీ ఓట్లను జన సూరజ్ పార్టీ భారీగానే చీల్చనున్నదని తేలింది. బీహారీ వలస కార్మికులకు అండగా నేనున్నానని ప్రశాంత్ కిషో ర్ చెప్పుకోవడం ద్వారా తెలంగాణకు వలస వెళ్లిన బీహార్ కార్మికులను ఆయన తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వ్యూహకర్త వ్యూహమేమిటీ..?

తెలంగాణ అసెంబ్లీకి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రతీకారం తీ ర్చుకోవాలంటే ఆయన ఏ వ్యూహాలు అనుసరిస్తారు?. రాష్ట్ర రాజకీ యాల్లో తన శత్రువుకు శత్రువు అయిన వారితో మిత్రుత్వం నెరపేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధమవు తున్నారా? యువతను ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టే కేటీఆర్‌కు మద్దతుగా నిలబడతారా అంటే ఔన నే ఊహాగానాలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీని విస్తరిస్తారని అనుకోలేం.

వర్కింగ్ ప్రెసి డెంట్‌గా అన్నీ తానై బీఆర్‌ఎస్‌ను నడిపిస్తున్న కేటీఆర్‌కు వ్యూహాత్మకంగా ఆయన మ ద్దతు తెలుపవచ్చు. ప్రశాంత్ కిషోర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడంలో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరాలు ఉం డవు. పైగా ఆది పా ర్టీకి ప్రయోజనకరంగా కూడా ఉం టుంది. అయితే బీహార్ ఎన్నికల ఫలితాలపై రానున్న పరిణామాలు ఆధారపడి ఉంటా యి. బీహార్‌లో తగినన్ని స్థానాలను ప్రశాంత్ కిషోర్ సాధించగలిగితే ఆయన మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అలా కాకపోతే అదివేరు సంగతి.