17-10-2025 01:07:00 AM
విశాఖపట్నం,అక్టోబర్ 16: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతోం ది. వరుస విజయాలతో సెమీఫైనల్లో అ డుగుపెట్టింది. విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఏ దశలోనూ బంగ్లా కంగారూలకు పోటీ ఇవ్వలేకపోవడంతో మ్యాచ్ వన్‌సైడ్‌గా ముగిసిం ది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. శోభన(66), హైదర్(44) రాణించా రు.
గార్డెనర్,అన్నాబెల్,కింగ్,జార్జియా తలో రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ అలీసా హీలీ( 77 బంతుల్లో 20 ఫోర్లతో 113) మరోసారి చెలరేగిపోయింది. బంగ్లా బౌలర్లను ఉతికారేస్తూ 73 బంతుల్లోనే సెంచరీ బాదేసింది. ఈ మెగాటోర్నీలో ఆమెకు ఇది వరుసగా రెండో సెంచరీ. భారత్‌తో మ్యాచ్‌లోనూ హీలీ శత కం బాదింది. మరో లిచ్‌ఫీల్డ్ (84) రన్స్‌తో సత్తా చాటింది. ఫలితంగా ఆసీస్ కేవలం 24.5 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఒకటి రద్దవడంతో 9 పాయింట్లు సాధించిన ఆసీస్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.