calender_icon.png 21 October, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటర్మైంట్ వార్తల వేళ కోహ్లీ ఆసక్తికర ట్వీట్

17-10-2025 01:06:02 AM

పెర్త్,అక్టోబర్ 16: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు రెడీ అవుతోంది. ఆదివారం పెర్త్ వేదికగా జరగబోయే మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీపైనే అంద రి చూపు ఉంది. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన కింగ్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడతాడా.. జట్టులో అతనికి చోటు దక్కుతుందా లేదా అనే దానిపై విపరీతంగా చర్చ జరుగుతోంది.

ఆసీస్ టూర్‌లో చెలరేగితే వరల్డ్‌కప్ జట్టులో ఉన్నట్టేనంటూ వార్త లు వస్తున్నాయి. ఒకవేళ ఫెయిలైతే మాత్రం ఆసీస్ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడ న్న ప్రచారం మొదలైంది.ఈ నేపథ్యంలో వి రాట్ కోహ్లీ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు ఫెయిలై నట్టే అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కోహ్లీ ట్వీట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిం ది. ఈ ఒక్క ట్వీట్‌తో రిటైర్మెంట్ వార్తలకు విరాట్ చెక్ పెట్టేశాడని పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆసీస్‌పై కోహ్లీ ఫెయిలైనా కూడా ప్రపంచకప్ జట్టులో అతనిలాంటి ఆటగాడు ఉండా ల్సిందనని పలువురు మాజీలు అభిపాయపడుతున్నారు.