calender_icon.png 19 October, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు ఐసీసీ అవార్డులు

17-10-2025 01:08:38 AM

దుబాయి,అక్టోబర్ 16: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో మరోసారి భారత క్రికెటర్ల హవా కొనసాగింది. సెప్టెంబర్ నెల కు గానూ ఈ పురస్కారాలు పురుషుల, మ హిళల రెండు విభాగాల్లోనూ టీమిండియాకే దక్కాయి. పురుషుల కేటగిరీలో యు వ ఓపెనర్ అభిషేక్ శర్మ, మహిళల విభాగంలో స్మృతి మంధాన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మం త్ అవార్డులకు ఎంపికయ్యారు. దు బాయి వేదికగా జరిగిన ఆసియాకప్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయాడు.

ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 200కు పైగా స్ట్రుక్ రేట్, 44కు పైగా యావరేజ్‌తో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. భారత్ టైటిల్ విజయంలో ఈ యువ ఓపెనర్‌దే కీ రోల్. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రికార్డు రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 బ్యాటర్‌గానూ కొనసాగుతున్నా డు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రేసులో కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ప్లేయర్ బిన్నెట్‌ను వెనక్కి నెట్టి అభిషేక్ విజేతగా నిలిచాడు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించడంతో పాటు అవార్డుకు ఎంపికైనందుకు ఈ యు వ ఓపెనర్ సంతోషం వ్యక్తం చేశాడు.

మరోవైపు భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది. ఆసీస్‌తో జరిగిన మూ డు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచ రీ చేసిన స్మృతి 77 యావరేజ్‌తో 308 రన్స్ సాధించింది. ఈ సిరీస్‌లో మం ధాన రికార్డ్ స్థాయిలో 50 బంతుల్లోనే సెం చరీ బాదేసింది. ఇలాంటి అవార్డులు ఎంతో ఉత్సాహా న్నిస్తాయని మంధాన చెప్పింది.