08-08-2025 06:50:26 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి టౌన్: జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా మండలాల వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, స్టాక్ పూర్తిగా అయిపోకముందే ఉన్నతాధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్ తో కలిసి అన్ని మండలాల ఎంఏవోలు, ఏఈఓలతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా మండలాల వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్టాక్ పూర్తిగా అయిపోకముందే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.
రైతులకు అవసరమైనంత మాత్రమే యూరియా బస్తాలు విక్రయించాలని, అవసరానికి మించి అదనంగా యూరియా బస్తాలు విక్రయిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచించారు. కాబట్టి వ్యవసాయ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అన్ని ఫర్టిలైజర్ దుకాణాలు, పిఎసిఎస్ లలో సేల్ రిజిస్టర్ లను తనిఖీ చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్ దుకాణాలు, పిఎసిఎస్ లలో తనిఖీలు చేస్తూ ఉండాలని, స్టాక్ బోర్డులను, రిజిస్టర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, సాంకేతిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.