08-08-2025 09:11:04 PM
పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు..
మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహల్రావు మండలం పెద్ద తుండ్ల గ్రామంలో శ్రీ వారాహి దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinubabu) హాజరయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణాల మధ్య యంత్రాలు, విగ్రహాలను ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి శాస్త్రోత్కంగా దేవతామూర్తులను ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం శ్రీను బాబు ప్రత్యేక పూజలు, హోమాలలో పాల్గొని గ్రామ ప్రజలు శ్రేయస్సుతో, సుఖ సంపదలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లోని భక్తి పారవశ్యనికీ మూలమని ఇలాంటి సానుకూల వాతావరణాన్ని కల్పించి గ్రామ ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆంజనేయ స్వామి భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.