08-08-2025 09:19:45 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బిజెవైఎం మండల ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి(BJYM Mandal General Secretary Dayakar Reddy) ఆధ్వర్యంలో ముందస్తు రక్షా బంధన్ వేడుకలు గణంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులకు, బిజెవైఎం నాయకులు విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు, బిజెవైఎం నాయకులు ఒకరి కొకరు నీకు నేను రక్షా నాకు నువ్వు రక్షా మనిద్దరం దేశానికి రక్షా, ధర్మానికి రక్షా అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డితో పాటు ప్రశాంత్, నవీన్, వినయ్ రెడ్డి, చందు, నిమ్మల సాయి, రమేష్ మాచర్ల, రాకేష్ యాదవ్, ప్రశాంత్, కార్యక్రమంలో పాల్గొన్నారు.