calender_icon.png 9 August, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ లో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

08-08-2025 09:11:29 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండలం(Tandur Mandal)లోని పలు గ్రామాలను మొదటి శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మహిళలు వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి బోయపల్లి గ్రామంలోని తన నివాసంలో వైభవంగా వరలక్ష్మి వ్రత పూజలను జరిపించారు. మహిళలందరికీ అష్టైశ్వర్యాలు చేకూరాలనే ఉద్దేశంతో తన ఇంట్లో మహిళలతో వరలక్ష్మి వ్రతాన్ని పెద్దఎత్తున జరిపించినట్లు ఆమె తెలిపారు. బోయపల్లి గ్రామానికి చెందిన మహిళలు వరలక్ష్మీ వ్రతంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.