08-08-2025 06:46:15 PM
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రజిత..
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో పీహెచ్సీ డాక్టర్ సారియా అంజుమ్, ఆర్బీఎస్ కే వైద్య సిబ్బంది ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాలలోని ఏకలవ్య గురుకుల మోడల్ రెసిడెన్షియల్ ఈఎంఆర్ఎస్ లో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించిన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రజిత(Dr. Rajitha) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుమానితులకు రక్త పరీక్షలు చేశారు. పలువురు విద్యార్థులకు జలుబు, దగ్గు సమస్యలు ఉన్నాయని పీ హెచ్ సీ డాక్టర్ సారియా అంజుమ్ నిర్ధారించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కొని వేడివేడి ఆహారాన్ని తినాలని సూచించారు. విద్యాలయం ఆవరణలో నీటి నిలువలు లేకుండా చూడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సిబ్బందికి సూచించినారు. ఏకలవ్య గురుకుల పాఠశాలలో కలుషిత హారంతో కూడిన జ్వరాలు లేవని డాక్టర్ స్పష్టం చేశారు.