calender_icon.png 9 August, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లంపల్లి బ్రిడ్జి కూలిపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే

08-08-2025 09:13:56 PM

బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న..

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) మల్లంపల్లి మండల  కేంద్రంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం“కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, వల్లనే అని బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఒక ప్రకటన ద్వారా అన్నారు పనులలో నాణ్యతా లోపం,భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే మల్లంపల్లి దగ్గరలోని కెనాల్ పై పాత బ్రిడ్జి కూలిపోవడానికి ప్రధాన కారణం అని బిఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న తీవ్రంగా విమర్శించారు. 163 జాతీయ రహదారిపై మల్లంపల్లి సమీపంలోని కెనాల్‌పై ఉన్న పాత బ్రిడ్జి గురువారం సాయంత్రం వేళలో  కూలిపోయింది. పక్కనే నూతన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం జరిగిన లోతైన తవ్వకాల కారణంగా పాత బ్రిడ్జి బలహీనపడి కూలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి కూలిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ఘటనపై సంబంధిత శాఖలు తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూక్య జంపన్న డిమాండ్ చేశారు.