11-07-2025 12:43:47 AM
ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 10(విజ యక్రాంతి): జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణ అభివృ ద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ, జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే,
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా,డిఎఫ్‌ఓ నీరజ్ కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డి ఆర్ డి ఓ దత్తరావు లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడు తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేసి ప్రగతి పదములు నడిపించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాల పథకాలు తీసుకురావడం జరుగుతుందని, ఆ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం జిల్లాలో శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించా రు.
మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 973 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయని, 137 అంగన్వాడి టీచర్ల ఖాళీలు, 357 ఆయాల ఖాళీలు ఉన్నాయని, ప్రతి అంగన్వాడి కేంద్రానికి పిల్లలు, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ వివరించారు. భేటీ బచావో - భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల చదువు, ఆరోగ్యంపై ప్రతి కళాశాలలో, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకం క్రింద ప్రతి ఆవాస గ్రామాలలో సుద్దమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు.
వర్షాకాలం దృష్ట్యా ప్రజలు కలుషితమైన నీరు త్రాగి వ్యాధుల బారిన పడకుండా వ్యాధులను నియంత్రణపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం క్రింద జిల్లాలో 19 రహదారులు, 31 వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటుందని, పనులలో అటవీ శాఖ అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా రోడ్లు భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా గ్రామాలలో సర్వీస్ రహదారులు, మురుగు కాలువలు, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సమ్మన్ కిసాన్ నిధులను అర్హులైన ప్రతి రైతులకు అందించాలని, జిల్లాలో యూరియా కొరతలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పక డ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సకాలంలో అందించాలని, ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలలలో అదనపు గదులు, మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసు కోవాలని తెలిపారు. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పర్యవేక్షించాలని, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ భాస్కర్, డిఎంహిచ్‌ఓ సీతారాం, విద్యుత్ శాఖ ఎస్. ఈ. శేషరావు, రోడ్లు భవనాల శాఖ ఈ. ఈ. సురేందర్, పంచాయితీ రాజ్ ఈ. ఈ. కృష్ణ, డిపిఓ బిక్షపతి, మిషన్ భగీరథ ఈ ఈ సిద్ధిఖి, సిపిఓ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.