calender_icon.png 11 July, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలదిగ్బంధం పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

11-07-2025 12:45:25 AM

  1. ప్రాణహిత పరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంటలు

పొంగిపొర్లుతున్న వాగుల

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై10 (విజయక్రాంతి): గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవాళ్ళు తొక్కుతుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో గురువారం తుమ్మిడి పెట్టి పుష్కర ఘాట్ ను ప్రాణహిత వర్ధనీరు తాకింది. ఏడాది ఇంత పెద్ద ఎత్తున వరద కావడం ఇదే మొదటి సా రి అని సమీప గ్రామ ప్రజలు చెబుతున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో లోత ట్టు గ్రామాలు, పంట పొలాలు జలమయం అయ్యాయి. చింతలమానపల్లి మండలంలో ని దింద గ్రామంలోకి బ్యాక్ వాటర్ రావడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. దయగం మండలంలోని రాంపూర్,  ఒడ్డుగూడా బెజ్జూరు మండలం మొగవెల్లి, సోమి ని, తలాయి,సుస్మిర్ గ్రామాలలో లోని పంట పొలాల్లో వరద నీరు చేరి పత్తి పంట పూర్తిగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు.

రవీంద్రనగర్ కౌటాల గ్రామాల మధ్య ఉన్న దన్నూర్ హెట్టిలో లెవెల్ వంతెన పైనుండి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దింద వాగులో యువకుడు గల్లంతు అయ్యాడు.దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.