calender_icon.png 7 December, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9న ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్ల ధర్నా

07-12-2025 12:00:00 AM

రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ

ముషీరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న ఖైరతాబాద్ రాష్ట్ర రవా ణా శాఖ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూ నియన్స్ జెఏసి తెలిపింది. ఈ మేరకు శనివారం నారాయణగూడలోని ఐఎన్‌టియుసి రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు బి. వెంకటేశం, మల్లేష్ గౌడ్, షాబాం కర్ దయానంద్, మారయ్య, ఎంఏ సలీం, సత్తిరెడ్డి, రామకిషన్, ఎండి మహబూబ్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధి కారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో డైవర్లకు ప్రతి ఏటా రూ.12 వేలు, ప్రమాద బీమా, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర డిమాండ్లను అమలు చేయాలని, ప్రమాద బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన ఆటో డ్రైవర్లకు పెన్షన్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినా సందర్భంగా తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఘనంగా సంబురాలు చేసుకుంటున్నారని, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఆటో డ్రైవర్లు కూడా ప్రభుత్వంతో కలిసి సంబురాలు చేసుకుంటారని తెలిపారు.

రాష్ట్రంలో ఒలా, ఉబర్, ర్యాపిడో  సేవలను నిలిపివేసి, వాటి స్థానంలో ప్రభుత్వమే ఒక కొత్త యాప్ తీసుకురావాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులతో మరణించిన ఆటో డ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావే శంలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.