calender_icon.png 7 December, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్ అవగాహన

06-12-2025 11:02:26 PM

రాజాపూర్: జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు రాజాపూర్ గ్రామంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రాంతీయ పోలీసు సిబ్బంది వాహనాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం చొక్కంపేట గ్రామంలో ఎన్నికల అవగాహన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎవరి నుండి అయినా డబ్బు, నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలు తీసుకోవడం లేక ఇచ్చేది చట్ట విరుద్ధం అని తెలిపారు.

ప్రజలు ఇలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని కోరారు. అలాగే పోటీదారులు ప్రచార కార్యకర్తలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని, అనుచిత ప్రచారం, గుంపులుగా తిరగడం, రాత్రివేళ క్యాంపులు, ఓటర్లపై ఒత్తిడి లేదా ప్రభావం చూపే చర్యలు పూర్తిగా నిషేధితమని డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్సై శివానందం గౌడ్, రాజాపూర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.