09-11-2025 10:22:45 PM
పలువురికి గాయాలు..
శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం..
తాడ్వాయి (విజయక్రాంతి): అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం సంతాయిపేట రోడ్డులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాడువాయి మండలం సంతాయి పేట్ గ్రామం నుండి శుభకార్యానికి ఆటోలో వెళుతుండగా చిట్యాల, తాడువాయి రోడ్డులో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో రెండు పల్టీలు కొట్టింది. 12 మంది ప్రయాణికులు ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి చేయి విరుగగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం జరగడంతో బాధితులు ఆందోళన చెందారు. బాధితులు తాడువాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాడువాయి పోలీసులు తెలిపారు.