15-10-2025 12:00:00 AM
సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సరెడ్డి పుల్లారెడ్డి
మణుగూరు, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ఆటో కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలనీ , ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన తర్వాత వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ప్రతి కార్మికునికి నెలకు రూ. 12వేల పింఛన్,రూ10లక్షల వరకు బీ మా సౌకర్యంతో పాటు ఆటో కార్మిక సంక్షే మ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులు రాయల భిక్షం, గడ్డం వెంకటేశ్వర్లు, కోశాధికారి కొత్తపల్లి సీతారాములు, సహాయ కార్యదర్శి తోట రమేష్, మ్యాజిక్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చారి,సతీష్,సత్య నారాయణ, ప్రసాద్,శంకర్ పాల్గొన్నారు.