01-05-2025 01:24:32 AM
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 30: ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మ్యాచింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు. బుధవారం కొడిమ్యాల మండలం నల్లగొండ పాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు మిల్లులకు తరలించాలని అన్నారు. అలాగే ట్యాబ్ డేటా ఎంట్రీ నమోదు, లారీ ట్రక్ సెట్ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలన్నారు. ధాన్యం సెంటర్లలో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్ ఉంచాలన్నారు.
రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, నీటి సదుపాయం, ఓ ఆర్ ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హమాలీలు ఉదయం,సాయంత్రం సమయాల్లో పనులు చేయాలన్నారు.