01-05-2025 01:25:19 AM
రూ 25 నుంచి 40 వేల డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పరిస్థితి
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 30 (విజయ క్రాంతి) : ఏ ప్రభుత్వం వచ్చినా.... ఏ పథకం ప్రవేశపెట్టిన... దళారుల దందా య ధావిధిగా కొనసాగుతోంది. గత ప్రభుత్వం హయాంలో దళిత బంధు పేరుతో, కల్యాణ లక్ష్మి షాది ముబారక్, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు లోనూ దళారుల హవా కొనసాగింది. నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలోనూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో దళారుల దందా కొనసాగుతోంది. గ్రామసభలు ద్వా రా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ, ఫైనల్ లిస్టులో పేరు ఉండాలంటే పైసలు సమర్పించుకోవాల్సిందేన అంటూ మధ్యవర్తులు లబ్ధిదారుల నుండీ 25 వేల నుంచి 40 వేల వరకు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెలబడుతున్నాయి.
తాజాగా ప్రభుత్వం ఎందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సమయంలో దళారుల బారినపడి దగా పడిన ప్రజలు ఆందోళన బాట పట్టడంతో వ్యవహారం వెలుగు చూ స్తోంది. ఇటు మున్సిపాలిటీలోనూ.. అటు పంచాయతీలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఇటీవల దగా పడిన లబ్ధిదారులు రోడ్డు ఎక్కిన విషయం విధితమే. ఏ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు అవకతవకలకు పాల్పడిన ఓ ఉద్యోగి పై అధికారులు చర్య తీసుకోవడం జరిగింది. చం డ్రుగొండ మండలంలో అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని గుర్రాలపాడు లో ప్రజలు ఆందోళన నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో డబ్బులు ఇవ్వాలని కండిషన్ పెట్టడంతో తిప్పనపల్లిలో ముగ్గు రు లబ్ధిదారులు మధ్య వ్యక్తులపై తిరగబడటంతో ఆ అంశం చర్చనీయాంశం గా మా రింది. రేపల్లెవాడలో లబ్ధిదారులపేరు జాబితాలో ఉండాలంటే రూ 25వేలు ఇవ్వాలని దళారులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే మీ పేరు లిస్టులో ఉండదని బెదిరించడం జరిగింది.
కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీసు ఎదుట లబ్ధిదారులు ఎ టేబుల్ ఆందోళనకు దిగారు. మాజీ కౌన్సిలర్లకు సంబంధం లే కుండా లబ్ధిదారుల ఎంపిక చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారు లు లబ్ధిదారుల ఎంపిక పట్ల పారదర్శకతగా పాటించాలని, దళారుల దందాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.