17 April, 2026 | 11:59 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు

29-05-2025 10:53 PM

మంచిర్యాల: 2024‌-25 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పెరిక ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గురువారం ఓవర్ బ్రడ్జి సమీపాన గల శిశుమందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ, విద్యా సంస్థల అధినేత అప్పని తిరుపతిలు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శాలువాలు, మెమొంటోలు అందజేసి ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో పెరిక ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెట్టం తిరుపతి, ప్రధాన కార్యదర్శి అంకతి తిరుపతి, కార్యవర్గ సభ్యులు తోట తిరుమలేష్, గోళ్ల రామన్న, ఆకిరెడ్డి శంకర్, అంకతి మల్లేష్, సభ్యులు ముత్యం బుచ్చన్న, ముత్యం నారాయణ, ముత్యం నాగ వర్మ, కందుల తిరుపతి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.