24 June, 2026 | 3:00 AM

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

24-06-2026 01:57 AM

మునిపల్లి, జూన్ 23: రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం మండలంలోని పోల్కంపల్లి, ఖమ్మంపల్లి గ్రామాల శివారులో గల పీఎస్‌ఆర్ గార్డెన్ లో బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, సీనియర్ నాయకుడు శివశంకర్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేంద్రం విధించిన టార్గెట్లను సాకుగా చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకోవడాన్ని వారు తప్పు పట్టారు.  అలాగే  రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ జొన్నలు పండించిన అన్నదాతను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 10క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయడం ఏమిటని వారుప్రశ్నించారు.

తెలంగాణ రైతుల శ్రమను కేంద్ర కోట  పరిమితులకు బందీ చేయడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రైతులకు ఒకేసారి  రైతు  భరోసాను రైతు అకౌంట్లలో వేయాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇర్ఫాన్ పటేల్, రాజు, మల్లేశం, రమేష్, మాజీ సర్పంచులు ఎడ్ల శంకర్, విజయ్ భాస్కర్, నాయకులు పరుశరాం గౌడ్, ఆనంద్ రావు, నాగేష్, సంగమేశ్వర్, విఠల్, రాజు, బక్కన్న, నర్సింలు, అంజన్న, దుర్గయ్య, మాణయ్య, మల్లేశం,సుల్తాన్, నాగన్న, భద్రప్ప, ఖదీర్, రాజు, నవీన్, గోపాల్,  చిన్న తదితరులు పాల్గొన్నారు.