08-08-2025 06:09:47 PM
వ్యాధులపట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రైడే డ్రైడే..
మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్...
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్(Municipal Commissioner Mahesh Kumar) తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనీ ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ తనదైన ముద్ర వేసేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. మున్సిపల్ పట్టణంలోని, పలు వార్డుల్లో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని, మూడో వార్డులో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని డివిజన్ ఆరోగ్య అధికారితో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు వందరోజుల కార్యచరణలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాల గురించి మార్కెట్ ఏరియాలో, టీ స్టాల్స్ దగ్గర అవగాహన కల్పించడం జరిగింది.
అందులో భాగంగా ప్లాస్టిక్ కప్పులు వాడకుండా తిరిగి ఉపయోగించే కాన్స్ గ్లాసులు వాడుతున్న టీ స్టాల్ ఓనర్ ని సన్మానించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కి జ్యూట్ బ్యాగులతో వచ్చే వినియోగదారులను కూడా పుష్పాలు ఇచ్చి వారిని ప్రోత్సహించారు. మరియు వ్యాపారులు ప్లాస్టిక్ వాడకూడదని హెచ్చరించడం జరిగింది. తర్వాత డ్రై డే ఫ్రైడే కార్యక్రమం మూడో వార్డులో నిర్వహించబడింది అక్కడ సీజనల్ వ్యాధుల గురించి తడి పొడి చెత్త గురించి అవగాహన కల్పిస్తూ వార్డులోని పలు విధుల్లో పర్యటించారు. ఈ సానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ జవాన్సు బిల్ కలెక్టర్స్ పాల్గొన్నారు.