01-08-2025 12:25:44 AM
ఎస్‌ఐ రామకృష్ణ
శ్రీరంగాపురం జులై 31 మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాల పై విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన చట్టా లు, పిల్లల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ యొక్క ప్రభావాల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఎస్త్స్ర మాట్లాడుతూ.. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న బాల కార్మిక వ్యవస్థను గుర్తించి,
దాని గురించి ఇతరులకు అవ గాహన కల్పించాలని, బాల కార్మిక వ్యవస్థ ను అంతం చేయడానికి కృషి చేయాలని, బా ల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.