01-08-2025 12:26:17 AM
టీపీసీసీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు
కామారెడ్డి, జూలై 31 (విజయ క్రాంతి), మహిళా కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో పటిష్టవంతం చేయాలని సంకల్పంతో జై భీమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిపిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ సమావేశాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. అంతకుముందు జిల్లాలో మొదటిగా కామారెడ్డి, కమాన్ జంక్షన్ దగ్గర జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు.
రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవిప్రసాద్ అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం నిర్వహించారు. బ్లాక్, బూత్, మండల్, గ్రామ కమిటీలకు నియామక పత్రం ఇవ్వడంతో పాటు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని, బూత్ లెవెల్ పటిష్టం చేయడానికి దిశా నిర్దేశం చేశారు.
చివరిగా మన రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం 4వ వార్డ్, హరిజనవాడ, సురేష్ హోటల్ దగ్గర సరిత ఇంటి వద్ద భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాకి సంభందించి ఇంచార్జీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మిమ్మతో పాటు జిల్లా మహిళ కాంగ్రెస్ నేతలు కామారెడ్డి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ధర్మగోనిలక్మి రాజా గౌడ్, స్వప్న,రేఖ,ch.అరుణ, వసుందర, కవిత, అంజలి, సంతోషి,సదానంద,,మహిళా అధ్యక్షురాలు, బూత్, మండల్,గ్రామ, పట్టణ కాంగ్రెస్ పార్టీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి కామారెడ్డి జిల్లా లో ఉన్న ఎమ్మెల్యే లందరికీ ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు కృతజ్ఞతలు తెలిపారు.