01-08-2025 12:25:04 AM
వీడ్కోలు పలికిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ జులై 31: (విజయ క్రాంతి): జులై నెలలో పదవి విరమణ చేసిన సిబ్బందికి నిజామాబాద్ సిపి సాయి చైతన్య వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవి విరమణ చేసిన వారిని సన్మానించారు. పదవి విరమణ చేసిన వారిలో హెచ్. మురళిధర్ రాజు, ఎ.ఎస్.ఐ, వేల్పూర్ పోలీస్ స్టేషన్ గారు పోలీస్ శాఖలో (35 సర్వీసు పూర్తి చేసి ‘ పదవి విరమణ‘ పొందరు.
ఎల్. నర్సింలు, ఎ.ఆర్.ఎస్.ఐ, పోలీస్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్ సత్యనారాయణ గౌడ్, ఎ.ఆర్.ఎస్.ఐ,పోలీస్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్ పదవి విరమణ చేశారు వీరికి పోలీస్ శాఖ తరపున వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వ హించి ఘనంగా శాలువలతో సిపి సత్కరించారు అనంతరం పదవి విరమణ శుభాకాంక్షలుసర్టిఫికేట్ జ్ఞాపికలను బహుకరించారు.
ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి, ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటలు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయ పడుతున్న అన్ని సీపి హామీ ఇచ్చారు. ఈ వీడ్కోళ్లుసందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ నివాస్, శ్రీ తిరుపతి,శ్రీ సతీష్ వారికుటుంబ సభ్యులు హజరు అయ్యారు.