calender_icon.png 7 November, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్ హైటెక్ హబ్‌లో సైబర్ జాగరూక్త దివస్ సందడి

07-11-2025 12:00:00 AM

మాదాపూర్ పోలీసుల ముమ్మర అవగాహన యజ్ఞం

శేరిలింగంపల్లి, నవంబర్ 6 (విజయక్రాంతి): రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సూచించారు. సీపీ ఆదేశాల మేరకు గురువారం సైబర్ జాగరూక్త దివస్లో భాగంగా మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం దుర్గం చెరువు వాకింగ్ ఏరియాలో వాకర్లతో సమావేశమై వివిధ రకాల సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

అనంతరం హైటెక్స్లోని నాగ్లో కన్స్ట్రక్షన్స్ వద్ద విద్యార్థులతో చర్చించగా, డబ్ల్యు3 గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ యూనివర్సిటీ, శ్రీ చైతన్య ఐఐటి క్యాంపస్ ఉమెన్స్ కాలేజీల్లో కూడా సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, డేటింగ్ యాప్ మోసాలు, ట్రేడింగ్ జాబ్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, రెంటల్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనీఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫ్రాడ్స్, డిజిటల్ ఫిషింగ్ మోసాలపై అవగాహన కల్పించారు.

ఆన్లైన్లో వచ్చే సందేశాలు, లింకులు, ఆఫర్లపై వెంటనే క్లిక్ చేయకుండా రెండు సార్లు ఆలోచించి మాత్రమే స్పందించాలని హెచ్చరించారు. ఏదైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయడం లేదా  cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్ ఆదేశాల మేర కు ఏసీపీ శ్రీధర్, ఎస్హెచ్‌ఓ కృష్ణమోహన్, డీఐ విజయ్, మాదాపూర్ ఎస్‌ఐలు పాల్గొన్నారు. దాదాపు 2,000 మంది ప్రజలు ఈ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.