calender_icon.png 7 November, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలం స్టార్స్ క్యాంపెయిన్‌కి దూరం!

07-11-2025 01:06:00 AM

జూబ్లీహిల్స్ ప్రచారానికి రాని ఎంపీలు అర్వింద్, ఆర్ కృష్ణయ్య, 

రాజస్థాన్ సీఎం, పలువురు కేంద్ర మంత్రులు

బాధ్యత అంతా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్‌రావుదే

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారా నికి, అటు బీఆర్‌ఎస్.. ఇటు కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ 40 మంది కీలక నేతలతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఓ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తొలిరోజు నామినేషన్ వేసేందుకు హాజరైన కేంద్రమంత్రి బండి సంజ య్..

గురువారం సాయంత్రం బోరబండలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు ఎట్టకేలకు హాజరయ్యారు. ఇక ధర్మపురి అర్వింద్ ముందు నుంచీ ప్రచారంలో కనబడడంలేదు. పైగా కిషన్‌రెడ్డిని ధర్మపురి అర్వింద్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ కిషన్‌రెడ్డి అడ్డా.. ఆయనదే బాధ్యత! అని ఆయన తన అనుచరుల వద్ద అన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వీరిద్దరితో ప్ర చారం చేయిస్తే పార్టీకి ప్లస్ అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ పోరాటంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తూ, జూబ్లీహిల్స్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, పురందేశ్వరి, జాతీ య నాయకులు తేజస్వీ సూర్య, అన్నామలై ఎవరూ పాల్గొనలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్‌తోపాటు మరికొంత మంది కీలక, ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొనలేదు. అయితే తీరా ప్రచారం సగం అయిపో యాక తెలంగాణ జనసేన పార్టీ మాత్రం మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొన్నది.

ఇద్దరి భుజాలపైనే బాధ్యతలు..

ఇదిలా ఉంటే ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నీ తామై ప్రచారంలో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ కిషన్‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాంచందర్‌రావుకి ఇది తొలి ఎన్నిక. దీంతో వారిద్దరి భుజాలపైనే ఉపఎన్నిక విజయం బాధ్యతలు మోస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది.

మిగతా నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ అలా వచ్చి ఇలా వెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రచారానికి మూడు రోజులే ఉన్నాయి. ఈ క్రమంలో స్టార్ క్యాం పెయినర్లు ఇంకా ఎప్పుడొస్తారని శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఫైర్ బ్రాండ్ నేతలు, జాతీయ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటే శ్రేణుల్లో ఉత్సాహం, ఓటర్లను తమవైపు ఆకర్షించడం ద్వారా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.

ఉప ఎన్నిక ఎపిసోడ్‌లో మరే ఇతర నేతలను ఇన్వాల్వ్ కాకుండా కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని, అందులో భాగంగానే ప్రచారంలో కీలక నేతలెవరూ పాలుపంచుకోవడం లేదనే చర్చ సైతం నడుస్తోంది. ‘ఒకవేళ గెలిస్తే క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడం.. ఓడితే నాయకులు సపోర్ట్ చేయలేదని ఢిల్లీ నాయకత్వం వద్ద చెప్పుకోచ్చనే’ అభిప్రాయంతో కిషన్‌రెడ్డి ప్రచారానికి రాని వారి గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అర్జున్ రామ్ మేఘావాల్, శ్రీనివాస్ వర్మతోపాటు రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మ, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్, ఆర్ కృష్ణయ్య, లక్ష్మణ్, పురందేశ్వరి, డీకే అరుణ, ఈటల రాజేందర్, సుజనా చౌదరి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాతీయ నేతలు తేజస్వీ సూర్య, అన్నామలై, సునీల్ బన్సల్, అభయ్‌పాటిల్, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, పాయల్ శంకర్, ఏపీ బేజీపీ చీఫ్ పీఎన్‌వీ మాధవ్, మురళీధర్‌రావు, కే అన్నామలై, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే వీరిలో కొంత మంది మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగతా కీలక నేతలు ఇంతవరకూ ప్రచారాని రాలేదు. 

షెడ్యూల్ ప్రకారం వస్తారు : కిషన్‌రెడ్డి

స్టార్ క్యాంపెయినర్లు షెడ్యూల్ ప్రకారం జూబ్లీహిల్స్ ప్రచారానికి వస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల మీడియా చిట్ చాట్‌లో తెలిపారు. నాయకుల షెడ్యూల్‌ను పార్టీ ఒక రోజు ముందు నిర్ణయిస్తోందన్నారు. అయినా జాబితాలో ఉన్నవాళ్లంతా ప్రచారంలో పాల్గొనాలని లేదన్నారు. ప్రచారంలో పాల్గొనేవారు ఇంకా ఉన్నారని, వారి షెడ్యూల్‌ను పార్టీయే నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.