07-11-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, నవంబర్ 6: బహుజన్ సమాజ్ పార్టీ సమీక్షా సమావేశం ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు వంగాల కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా పల్లాటి రాములు, జిల్లా కార్యదర్శి గ్యార మల్లేష్, మహిళా ఇంచార్జీ కంబాలపల్లి శాంత హాజరై, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బుధవారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ లను ఆవిష్కరణ చేశారు.
అలాగే ఇబ్రహీంపట్నం నుండి నాగన్ పల్లి వెళ్లే మార్గంలోని రోడ్లను అదేవిధంగా మూలమలుపు దగ్గర ఉన్న భయంకరమైన చెరువును సందర్శించి వెంటనే రోడ్లను, చెరువుకు అడ్డంగా ఏదైనా ప్రమాదం జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా ధారసిరి (లావణ్య), తుర్క యంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మునుగనూరు వార్డు అధ్యక్షులుగా జానీ తదితరులకు పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షులు గుండె శ్రీనివాస్, కోశాధికారి బంగారీగల్ల మహేందర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు మంద రాజు, ఉపాధ్యక్షులు చెరుకూరి కరుణాకర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పట్నం రమేష్ కురుమ, కమిటీ సభ్యులు చిత్రం కృష్ణ, గోరటి కుమార్, మేడిపల్లి మహేష్ పాల్గొన్నారు.