26-12-2025 03:55:00 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబారలో శుక్రవారం పశు వైద్యాధికారి డాక్టర్ శరణ్య ఆధ్వర్యంలో జీవాలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బంబార గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజి గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ... గొర్రెల, మేకల పెంపకదారులు సీజన్ లో ఎలాంటి వ్యాధులు రాకుండా మేకల, గొర్రెల పెంపకదారులు మందులు తప్పనిసరిగా తాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడ సంతోష్, మండల పశువైద్య సిబ్బంది గణపతి , రాజు , నరేష్ , వినోద్ , శ్రీకాంత్, గ్రామస్తులు మహేష్, రాంచం దర్, పోషణ, సాంబయ్య , గోపాల్, నగేష్ , బాలాజీ , శ్రీశైలు తదితరులు పాల్గొన్నారు.