26-12-2025 03:24:49 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ప్రపంచంలో ఎక్కడ లేనంతగా భారతదేశంలో సామాజిక అసమానతలు, కుల వివక్షలు పెరగడానికి అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రమే కారణమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెపాక కృష్ణ విమర్శించారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో ఆ సంఘం ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అసమానతలకు కారణమైన మనువాదాన్నిప్రోత్సహిస్తున్న ఆర్ఎస్ఎస్–సంగ్ పరివారం దేశానికి ప్రమాదకరంగా మారిందని విమర్శించారు.
భారతరాజ్యాంగంసమానత్వం,సోదరభావం,న్యాయాన్ని హామీ ఇస్తుందని, అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యవాదిపై ఉందన్నారు. అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు.బహుజన సామాజిక వాదులంతా ఐక్యంగా నిలబడి మనువాదాన్ని ఈ దేశ మట్టిలోనే పాతిపెట్టాలని పిలుపునిచ్చారు.అశాస్త్రీయమైన మనుస్మృతిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఒంటెపాక వెంకటేశ్వర్లు, ఏర్పుల తాజేశ్వర్, బుడిగ యాదగిరి, కుమ్మరి సత్యపాల్, వెంకన్న, కె. మధు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.