08-05-2025 12:26:53 AM
- ఎస్‌ఐ కె వెంకటేష్
హన్వాడ మే 7 : సైబర్ నే రాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండవలసిన అవ సరం ఎంతైనా ఉందని ఎస్‌ఐ వెంకటేష్ అన్నారు. బుధవారం హన్వాడ మండల కేంద్రంలో సైబర్ నేరాలపై గురించి ఎస్‌ఐ కె వెంకటేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్త్స్రమాట్లాడుతూ సైబర్ నేరాలు ఏ విధంగా చేస్తారు, దాని ద్వారా వారు డబ్బులు ఎలా దోచుకోవడం జరుగుతుందో అనే విషయాలపై ప్రజలకు వివరించారు. ప్రజలు ఎవరైనా ఓటిపి, ఏటీఎం పిన్, యూపీఐ నెంబర్, ఆధార్ కార్డు నంబర్ లాంటి విషయాలు అడిగితే ఇవ్వకుండా సైబర్ వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలాంటి సైబర్ నేరాలకు ఎవరైనా గురి అయితే వెంబడే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్, ప్రజలు పాల్గొన్నారు.