విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
డీసీపీ (రోడ్ సేఫ్టీ) ఐనపర్తి లక్ష్మి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని డీసీపీ (రోడ్ సేఫ్టీ) ఐనపర్తి లక్ష్మి అన్నారు. వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, సురక్షిత జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు మాదకద్రవ్యాల వ్యతిరేక, ర్యాగింగ్ నిరోధక, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు సహా 5 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
ఈకార్యక్రమానికి డీసీపీ (రోడ్ సేఫ్టీ) ఐనపర్తి లక్ష్మి, ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి. సీతారాం, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పోచారం ఐటీ కారిడార్ ఎస్‌హెచ్‌ఓ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం తరపున డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి. విజయకుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ కె.ఎస్. చలపతి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ వి. శ్రీనివాస్ రావు, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కల్నల్ ఆర్. వెంకటేశన్ (రిటైర్డ్), ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, డీన్లు, హెచ్‌వోడీలు, ఎన్‌సీసీ అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్ ట్రైనర్లు పాల్గొన్నారు. డీసీపీ ఐనపర్తి లక్ష్మి ర్యాగింగ్ దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ఎస్పీ సీతారాం, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలను వివరించి, జీవితానికి, కుటుంబానికి విలువనిస్తూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు.






