ఇల్లంతకుంటలో జయశంకర్ జయంతి వేడుకలు
06-08-2026 08:43 PM
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగం, పోరాటం, సేవలను స్మరించుకున్నారు.






