6 August, 2026 | 10:03 PM

బిజెపి జిల్లా నూతన అధ్యక్షుడిగా మల్లేశం

06-08-2026 08:41 PM

సత్కరించిన నగర డిప్యూటీ మేయర్

ముకరంపుర,(విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అడ్వకేట్ సాయిని మల్లేశం ను గురువారం ఎంపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో నూతన జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం  సారథ్యంలో కరీంనగర్ జిల్లాలో అన్ని ఎన్నికల్లోనూ విజయాలు సాధించి, అత్యధిక స్థానాలు గెలిచేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం అని తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, అలాగే నూతన అధ్యక్షుడు చేపట్టే పార్టీ ప్రతీ కార్యక్రమంలోనూ అలాగే ప్రజా ఉద్యమాల్లోనూ తన వంతుగా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానని యాదగిరి సునీల్ రావు  స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా అడుగులు వేసి కరీంనగర్ జిల్లాలో పార్టీ పరంగా అజేయ శక్తిగా మార్చుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కే ఏపీపీ చంద్ర, తోట అనిల్, సోమిడి వేణు నాయకులు తదితరులు పాల్గొన్నారు.