6 August, 2026 | 10:03 PM

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి

06-08-2026 08:45 PM

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ బట్టు మధు, చల్లా ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, క్లబ్ సభ్యులు కొనతం ఆదిరెడ్డి, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, ఉపాధ్యాయులు రషీద్ ఖాన్, మాతంగి సైదులు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

పి.ఎం.శ్రీ.జి.పా.ఉ.పా నేరేడుచర్లలో తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా పిఎంశ్రీ, జడ్పీహెచ్ఎస్ నేరేడుచర్ల పాఠశాల యందు  ప్రధానోపాధ్యాయులు బట్టు మధు ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించడం జరిగింది. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ లు అర్పిస్తూ నినాదాలు చేశారు.