శ్రీ నారాయణ హై స్కూల్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
06-08-2026 08:38 PM
గణపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ నారాయణ హై స్కూల్‌లో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ నాగనబోయిన రవి, కరస్పాండెంట్ పోతుగంటి శశిధర చారి మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ సాధనకు ఉద్యమ స్ఫూర్తి నింపిన మహనీయుడని, ఆయన ఆశయాలను కొనసాగించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పోతుగంటి స్వప్న చారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






