మొక్కలను నాటండి.. భవిష్యత్ కాపాడుదాం
06-08-2026 07:38 PM
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి పూల మొక్కలు, వివిధ రకాల మొక్కలు ఇంటి పరిసర ప్రాంతంలో నాటాలని తెలుపుతూ ప్రతి ఇంటికి వెళ్లి మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ. పచ్చదనం పెంచుదాం, పరిశుభ్రత పాటిద్దాం,ఆరోగ్యంగా జీవిద్దాం,మొక్కలను నాటండి భవిష్యత్తు కాపాడుదాం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి మన గ్రామం మన బాధ్యతగా మనమందరం సుభిక్షంగా ఉందాం అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.






