calender_icon.png 2 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ గౌరవించాలి

01-08-2025 12:06:33 AM

  1. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి 
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 31(విజయక్రాంతి): సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కొందమంది అడ్డదారులు తొక్కినంత మాత్రాన దేశ ప్రజా స్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేశారు. సుప్రీం తీర్పుపై కేటీఆర్ స్పందిస్తూ కోర్టులను తప్పుదోవ పట్టించాలన్న కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొని అంతిమంగా సత్యమే గెలిచిందన్నారు. స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని కాం గ్రెస్ చేసిన నీతిమాలిన, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపుల రాజకీయానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ లాంటిదన్నారు. సుప్రీం తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

రాహుల్.. నిజాయితీ నిరూపించుకోవాలి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తన ని జాయితీ, నిబద్ధతను నిరూపించుకోవాలన్నారు. పార్టీ మారితే అటోమేటిగ్గా అనర్హత వర్తించాలని పాంచ్ న్యాయ్ పేరుతో చెప్పిన  రాహుల్.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలన్నారు. రాహుల్ చెప్పే నీతులు ఆచరణలో చూపించాలనిడిమాండ్ చేశారు. చేతిలో రా జ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ సుప్రీంతీర్పుపై చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.