calender_icon.png 24 October, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పోలీస్ సేవలపై అవగాహన..

22-10-2025 04:55:34 PM

జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవన్ని పురస్కరించుకొని కస్తూర్బ పాఠశాల విద్యార్థులకు పోలీసుల విధులపై ఓపెన్ హౌస్ కార్యక్రమం స్థానిక ఎస్ఐ కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి రిసెప్షన్, పెట్రోలింగ్, క్రైమ్ ప్రివేన్షన్, సీసీ కెమెరాల పనితీరుపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్దాలు గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండలని తెలిపారు. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే డైయాల్ 100 కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్, సిబ్బంది మహేష్, కళా, లింగం, బాలకిషన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.