calender_icon.png 24 October, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీల్లోనే నిర్వహించాలి

22-10-2025 04:57:49 PM

మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్లు

తుంగతుర్తి (విజయక్రాంతి): పీఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని విద్యాశాఖకు అప్పగిస్తూ నిర్ణయం చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అంగన్వాడి టీచర్లు డిమాండ్ చేశారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్లు నిరసన వ్యక్తం చేసి మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం నూతన విద్యా విధానాన్ని తెచ్చిందన్నారు.

పీఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల్ని విద్యాశాఖను అప్పగిస్తూ నిర్ణయం చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలన్నారు. విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు అప్పజెప్పాలని వారన్నారు. విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని మాకు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ల స్వరూప, లక్ష్మీబాయి, మంగమ్మ, మాధవి శారద సరిత నిర్మల ఉమా, వసంత, రామతార, శోభ తదితరులు పాల్గొన్నారు.