calender_icon.png 17 January, 2026 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి

17-01-2026 09:55:50 PM

రాష్ట్ర కో కన్వీనర్, ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్ర

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పరిషత్ పిఆర్టియు భవన్ లో శనివారం రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం రాష్ట్ర కో కన్వీనర్, ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనాలు అందలేదని, సంవత్సరం నర కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప మాకు రావలసిన జిపిఎఫ్, టిఎస్జిఎల్ఐఎస్సి, జిఐఎస్, లీవ్ ఇన్ క్లాస్మెంట్, కమ్యూటేషన్ మొదలైన ప్రయోజనాలు ప్రభుత్వం నుండి రాలేదని, రిటైర్డ్ ఉద్యోగులు మానసికక్షోభకు గురవుతున్నారని అన్నారు.

బకాయిల సాధన కమిటీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర మాట్లాడుతూ మాకు రావలసిన, మేం దాసుకున్న మా డబ్బులు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ మొదలైన బకాయిలు ఇప్పించాలని మేము ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేలా, మా ఆత్మగౌరాన్ని కాపాడండి అని ముఖ్యమంత్రిని కోరారు. ఉద్యోగుల బెనిఫిట్స్ రాక పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక చదువుల కోసం చేసిన అప్పులు నెలవారి ఈ ఈఎంఐ లు కట్టలేక మానసిక ఆవేదనతో రోగాల బారిన పడి వైద్యం చేయించుకోలేక సహాయం కోసం అర్థిస్తున్నామని,

రాష్ట్రంలో ఇప్పటివరకు 43 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని ఇంకా చాలా మంది అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని కావున మా బాధను అర్థం చేసుకోని వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి దేవదాస్, ఎండి అబ్దుల్ గఫర్, మేకిరి దామోదర్, కార్యదర్శులు ఈ. ఇంద్రసేనారెడ్డి, ట్రేజర్ సూర కుమారస్వామి, కె.వి చలం, అశోక్ కుమార్, సంజీవరెడ్డి, బత్తిని సారయ్య కేశవకుమార్ పి. రాజిరెడ్డి, టి. రఘువీర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.